దావోస్ : ఓ వైపు డబ్ల్యూఈఎఫ్‌లో 'నాటు నాటు', మ‌రో వైపు రూ.21వేల కోట్ల పెట్టుబ‌డి

Davos: Telangana does 'Naatu Naatu' at WEF, secures Rs 21K Cr investment.ఆర్ఆర్ఆర్ చిత్రం తొలి సారి గోల్డెన్ గ్లోబ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jan 2023 11:33 AM IST
దావోస్ : ఓ వైపు డబ్ల్యూఈఎఫ్‌లో నాటు నాటు, మ‌రో వైపు రూ.21వేల కోట్ల పెట్టుబ‌డి

'రౌద్రం ర‌ణం రుధిరం( ఆర్ఆర్ఆర్)' చిత్రం తొలి సారి గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుని చ‌రిత్ర సృష్టించ‌డంతో తెలుగు మాట్లాడే ప్ర‌జ‌లు సంబురాలు చేసుకుంటున్నారు. అదే విధంగా రాష్ట్రానికి రూ.21వేల కోట్ల విలువైన పెట్టుబ‌డులు వ‌స్తుండ‌డంతో తెలంగాణ కూడా సంబురాలు చేసుకుంటోంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం రాష్ట్ర వ్యాపార సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగింది.

ఓ ప‌క్క ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భ‌యాలు చుట్టుముట్టిన త‌రుణంలో, పెట్టుబడి వాతావరణం అనుకూలంగా లేని సమయంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ₹21,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగల‌డం విశేషం.

మైక్రోసాఫ్ట్: రూ.16,000 కోట్లు

రూ.16,000 కోట్ల వ్యయంతో 100 మెగావాట్ల ఐటీ లోడ్ సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు గతంలోనే మెక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది. అయితే.. ఇప్పుడు మ‌రో మూడు అంటే మొత్తం ఆరు డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కంపెనీ ఇప్పుడు రూ.32,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

ఎయిర్‌టెల్: రూ.2000 కోట్లు

భారతి ఎయిర్‌టెల్ గ్రూప్ హైదరాబాద్‌లో 60 మెగావాట్ల (MW) IT లోడ్ సామర్థ్యంతో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో ఎయిర్‌టెల్ యొక్క అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి.

యూరోఫినా: రూ.1000 కోట్లు

ఆహారం, పర్యావరణం, ఫార్మాస్యూటికల్ మరియు కాస్మెటిక్ ఉత్పత్తుల పరీక్షలో గ్లోబల్ లీడర్, అలాగే బయోఅనలిటికల్ టెస్టింగ్‌లో గ్లోబల్ సైంటిఫిక్ లీడర్ యూరోఫినా. రూ.1,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ప్రయోగశాల క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రయోగశాల, డ్రగ్స్ ఆవిష్కరణలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ప్రదేశంగా నిలబెట్టింది.

PepsiCo, Allox, Appolo టైర్స్, WebPT, ఇన్‌స్పైర్ బ్రాండ్‌లు: రూ.2,000 కోట్లు

గ్లోబల్ బహుళజాతి ఆహార సంస్థ పెప్సికో హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికను ప్రకటించింది. 2019లో 250 మంది ఉద్యోగులతో ప్రారంభమైన పెప్సికో ఇప్పుడు ప్లాంట్‌లో 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఉద్యోగుల సంఖ్యను 4,000కు చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

అల్లాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ 10GWH సామర్థ్యానికి మరింత విస్తరించేందుకు 3GWH/PA ప్రారంభ సామర్థ్యంతో రాష్ట్రంలో C- లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాక్టివ్ బ్యాటరీ మెటీరియల్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లో అపోలో టైర్స్ మెగా డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఔట్ పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపీ పేషెంట్ మరియు ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్ కంపెనీ, WebPT తన కొత్త గ్లోబల్ కెపాబిలిటీస్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

40 బిలియన్ డాలర్ల US కంపెనీ `ఇన్‌స్పైర్' హైదరాబాద్‌లో తన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిని ప్రకటించింది. ఆర్బీస్, బాస్కిన్-రాబిన్స్, బఫెలో వైల్డ్ వింగ్స్, డంకిన్, జిమ్మీ జాన్స్, రస్టీ టాకో మరియు సోనిక్ వంటి ప్రముఖ బ్రాండ్‌లను ఇన్‌స్పైర్ కలిగి ఉంది.

అతిపెద్ద విజయం

హెల్త్‌కేర్ మరియు లైఫ్ సైన్సెస్‌పై దృష్టి సారించిన నాల్గవ పారిశ్రామిక విప్లవానికి కేంద్రాన్ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌ను తన భారతదేశ హబ్‌గా ఎంచుకోవడం బృందం యొక్క అతిపెద్ద సాఫల్యం.

తెలంగాణ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ సెంటర్‌గా పేరొందింది. ఇది ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాక్సిన్‌లలో 1/3వ వంతును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రకటనతో తెలంగాణ ఈ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా తన స్థానాన్ని విస్తృతం చేసుకోనుంది.

గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో రూ.2.7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రంలో 17 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని కల్పించింది. 2014లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్యంపైనా చాలా మంది నిపుణులు అనుమానం వ్యక్తం చేయడం మరువకూడదు. అందరూ అంచ‌నాల‌ను త‌ప్ప‌ని నిరూపిస్తూ సీఎం కే చంద్రశేఖర్‌రావు దార్శనికతతో తెలంగాణ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

Next Story