ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ద‌స‌రా సెల‌వులు ఎప్ప‌టి నుంచంటే..?

Dasara holidays announced for schools in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విద్యార్థుల‌కు శుభ‌వార్త ఇది. ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2021 4:30 AM GMT
ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ద‌స‌రా సెల‌వులు ఎప్ప‌టి నుంచంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విద్యార్థుల‌కు శుభ‌వార్త ఇది. ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ఇవ్వ‌నున్నారు. అకాడ‌మిక్ ఇయ‌ర్ ప్రారంభ స‌మ‌యంలోనే దసరా సెలవులను ఆరు రోజులుగా ప్రభుత్వం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. ఇక 17వ తేదీ ఆదివారం కావ‌డంతో పాఠ‌శాల‌లు 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా 9వ తేదీ నుంచి 17 వ‌ర‌కు అంటే 9 తొమ్మిది రోజుల పాటు సెల‌వులు ఉండ‌నున్నాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ద‌స‌రా సెల‌వులు ప్రారంభమ‌య్యాయి. నేటి నుంచి 17 వ‌ర‌కు తెలంగాణ‌ల‌లో పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. అక్క‌డ కూడా పాఠశాలలు ఈ నెల 18వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. జూనియర్‌ కళాశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

Next Story
Share it