Telangana: 8 మంది ఐపీఎస్‌లు బదిలీ

రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. 8 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ నిన్న రాత్రి చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.

By అంజి  Published on  23 Feb 2025 9:04 AM IST
CS Shanti Kumari, transfer, IPS officers, Telangana

Telangana: 8 మంది ఐపీఎస్‌లు బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. 8 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ నిన్న రాత్రి చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.

హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్‌ డేవిస్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా గజారావు భూపాల్‌, సీఐడీ ఎస్పీగా నవీన్‌ కుమార్‌, గవర్నర్‌ ఏడీసీగా శ్రీకాంత్‌, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటలిజెన్స్‌ ఎస్పీగా శ్రీధర్‌, హైదరాబాద్‌ ఎస్పీ డీసీపీగా చైతన్యకుమార్‌ నియమితులయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇద్దరు ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న రిలీవ్‌ చేసింది. రోడ్‌ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్‌, రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను రిలీవ్‌ చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story