14 మందితో సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

కాంగ్రెస్‌తో ఫ్రెండ్‌షిప్‌కి సీసీఎం కటిఫ్‌ చెప్పింది. ఇప్పటికే పోటీ చేసే స్థానాల విషయంపై స్పష్టతను ఇచ్చిన ఆ పార్టీ.. తాజాగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.

By అంజి  Published on  5 Nov 2023 10:21 AM IST
Cpm, Cpm Candidates, Telangana Polls, Congress

14 మందితో సీపీఎం అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

కాంగ్రెస్‌తో ఫ్రెండ్‌షిప్‌కి సీసీఎం కటిఫ్‌ చెప్పింది. ఇప్పటికే పోటీ చేసే స్థానాల విషయంపై స్పష్టతను ఇచ్చిన ఆ పార్టీ.. తాజాగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది సీపీఎం. ఫలితంగా కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు పెట్టుకోవట్లేదని తేలింది.

కాంగ్రెస్‌ మొదట ప్రతిపాదించిన మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సీపీఎం కోరింది. అయితే దీనికి కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఒంటరిగానే పోటీ చేస్తామని గురువారం నాడు ప్రకటించింది. 17 స్థానాల్లో పోటీ చేస్తామని కూడా తెలిపింది. ఈ క్రమంలో 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మిగతా స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. వారి పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని తమ్మినేని తెలిపారు.

సీపీఎం ప్రకటించిన అభ్యర్థులు వీరే

భద్రాచలం - కారం పుల్లయ్య

అశ్వరావుపేట -పి. అర్జున్

పాలేరు - తమ్మినేని వీరభద్రం

మదిరా - భాస్కర్

వైరా - భూక్యా వీరభద్రం

ఖమ్మం- శ్రీకాంత్

సత్తుపల్లి- మాచర్ల భారతి

మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్ - చిన్న వెంకులు

భువనగిరి - నర్సింహ్మ

జనగాం - కనకం రెడ్డి

ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య

పటాన్ చెరు - మల్లిఖార్జున

ముషీరాబాద్ - దశరథ్

Next Story