తెలంగాణలో మరోసారి వ్యాక్సినేషన్‌కు బ్రేక్.. నేడు, రేపు బంద్
Covid vaccination drive stopped in telangana for two days.తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వ్యాక్సినేషన్‌కు బ్రేక్ పడింది.
By తోట వంశీ కుమార్ Published on
15 May 2021 2:01 AM GMT

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వ్యాక్సినేషన్‌కు బ్రేక్ పడింది. కేంద్ర ప్రభుత్వం కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిలో మార్పులు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువును 12-16 వారాలకు పెంచడం, కొవిన్ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులు, తదితర కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ తిరిగి 17న ప్రారంభించనున్నారు. 45 ఏండ్లకు పైబడినవారికి అందజేస్తున్న వ్యాక్సిన్ కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న 12 వారాల తరువాతే రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కోవిషీల్డ్ రెండో డోస్‌ను 6 నుంచి 8 వారాల తరువాత ఇచ్చారు. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story