Vikarabad: బట్టలు ఆరవేస్తుండగా కరెంట్‌ షాక్.. దంపతులు మృతి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు.

By అంజి  Published on  26 Feb 2024 12:46 PM IST
Couple electrocuted, Vikarabad, Telangana

Vikarabad: బట్టలు ఆరవేస్తుండగా కరెంట్‌ షాక్.. దంపతులు మృతి

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన బొమ్రాస్‌పేట మండలం బుర్హాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బోయిన లక్ష్మణ్ (48), అతని భార్య లక్ష్మి (42) ఇంటి ముందు ఉన్న ఇనుప తీగపై బట్టలు ఆరవేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం ఉతికిన బట్టలు ఇంటి ముందు అరవేస్తుండగా లక్ష్మికి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో గట్టిగా అరిచింది. దీంతో భర్త వచ్చి భార్య లక్ష్మిని పట్టుకొని విద్యుత్ తీగ నుండి గట్టిగా లాగే ప్రయత్నం చేశాడు. కానీ ఇద్దరికీ విద్యుత్ షాక్ తగలడంతో దంపతులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్ సరఫరా వ్యవస్థలో కొన్ని సాంకేతిక సమస్య కారణంగా ఈ సంఘటన జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ ఘాతంతో భార్య భర్తలిద్దరు మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. ఒకే రోజు భార్యా భర్తలు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నిండింది.

Next Story