తెలంగాణ‌లో క‌రోనా టీకా ధ‌ర ఎంతంటే..?

Corona Vaccine cost below RS 400 in telangana.మార్చి 1 నుంచి 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారితో పాటు 45 ఏళ్లు పైబ‌డిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 4:18 AM GMT
తెలంగాణ‌లో క‌రోనా టీకా ధ‌ర ఎంతంటే..?

మార్చి 1 నుంచి 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారితో పాటు 45 ఏళ్లు పైబ‌డిన దీర్ఘ‌కాల రోగుల‌కు క‌రోనా టీకా ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో పాటు 236 ప్రైవేటు ఆస్ప‌త్రులు టీకాను అందించేందుకు సిద్దం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ప్రైవేట్, కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే టీకా వేసేందుకు అనుమతి ఉంది. ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం కరోనా టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్రం సూచించిన ఏజ్ గ్రూపు వారిలో ఎవరైనా సరే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నగదు చెల్లించి టీకా తీసుకోనే అవకాశాం కల్పించింది.

కాగా.. క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర‌పై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్రంలో క‌రోనా టీకా ధ‌ర ఎంత ఉంటుంది అన్న సందేహాం ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అవుతోంది. దీనిపై ప్ర‌భుత్వం స్పందించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 300 నుంచి రూ. 400 మధ్య ధర ఉంటుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్ప‌ష్టం చేశారు. ఇప్పటివరకూ ఫ్రంట్ లైన్ యోధులకు ఉచితంగా టీకాను అందిస్తూ వచ్చామని.. స్ప‌ష్ట‌మైన ధ‌ర‌పై రెండు రోజుల్లోనూ తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ప్రస్తుతానికి అర్హతగల వారికి మాత్రమే ఇస్తామన్నారు.

వ్యాక్సినేషన్ అనంతరం తప్పనిసరిగా వారి పేరు, వివరాలను యాప్ డేటాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఎన్ని టీకాలు వేశారో నమోదు చేయాల్సి ఉంటుంది. టీకా వేసే సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
Next Story
Share it