కాంగ్రెస్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. అటు సోనియా, ఇటు రేవంత్ రెడ్డి..!

Corona tension in congress party Sonia Gandhi tests positive.మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నేడు చేప‌ట్టిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 7:50 AM GMT
కాంగ్రెస్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. అటు సోనియా, ఇటు రేవంత్ రెడ్డి..!

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నేడు చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూరం అయ్యారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. న‌మూనాల‌ను ప‌రీక్ష‌లకు పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇంకా ఫ‌లితాలు రావాల్సి ఉంది. మునుగోడు పాద‌యాత్ర‌ ఏడు గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల వరకు సాగేలా ప్లాన్ చేశారు. చౌటుప్పల్, నారాయణపూర్ లో పాదయాత్ర సాగనుంది. ఇందులో జానారెడ్డి, ఉత్తమ్ , భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్లు నేత‌లు కూడా పాల్గొన‌నున్నారు.

మ‌ళ్లీ క‌రోనా బారిన సోనియా..

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జైరాం ర‌మేశ్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. సోనియాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింద‌ని జైరాం ర‌మేశ్ తన ట్వీట్‌లో తెలిపారు. ప్ర‌స్తుతం ఆమె హోం ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని తెలిపారు. ఈ ఏడాది జూన్ 2న సోనియా గాంధీ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.


Next Story
Share it