తెలంగాణ రాష్ట్రంలో గత పదిరోజులుగా నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎట్టకేలకు ప్రారంభమైంది. వ్యాక్సిన్ల కొరత కారణంగా ఈ కార్యక్రమం నిలిచిపోగా.. నేటి (మంగళవారం) నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్లు ఇస్తున్నారు. తొలి డోసు వేయించుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారు దగ్గరలోని ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి తీసుకోవాలని సూచిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
సోమవారం సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ అధికారులతో సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే తొలిడోసు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వాళ్లు దగ్గరలోని ప్రభుత్వ వ్యాక్సి నేషన్ కేంద్రానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం వస్తున్న ఏ ఒక్కరినీ వెనక్కి తిప్పి పంపరాదని, ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు పీహెచ్‌సీలు, పరీక్షా కేంద్రాలకు సరఫరా చేస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. మరోవైపు కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమైన సూపర్ స్ప్రెడర్లను గుర్తించాలని ఆయన సూచించారు. సూపర్ స్ప్రెడర్లను ప్రత్యేకంగా వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశిం చారు. దీనికి సంబంధించి తగిన విధి విధానాలను రూపొందించాలని సీఎం సూచించారు. కాగా.. తెలంగాణలో వ్యాక్సినేషన్ కోసం అవసరమైన టీకాల సరఫరా కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. జూన్ 4వ తేదీ వరకు టెండర్ల దాఖలు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.