ఏపీ, తెలంగాణ‌ క‌రోనా బులిటెన్‌

Corona Bulletin. తెలంగాణలో గత 24 గంటల్లో 434 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

By Medi Samrat  Published on  22 Jun 2022 5:00 PM GMT
ఏపీ, తెలంగాణ‌ క‌రోనా బులిటెన్‌

తెలంగాణలో గత 24 గంటల్లో 434 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు నమోదైన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,680 కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,97,138గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో గత 24 గంటల్లో అత్యధికంగా 292 కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డి (71), మేడ్చల్ మల్కాజిగిరి (28) అత్య‌దికంగా కేసులు న‌మోద‌య్యాయి.

24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 129 మంది కరోనావైరస్ నుండి కోలుకున్నారు, రికవరీ రేటు 99.%.గా ఉంది. గడిచిన 24 గంటల్లో 27,754 నమూనాలను పరీక్షించారు. 507 స్వాబ్ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం మొత్తం 340 కేసులు నమోదయ్యాయి. మంగళవారం 298 కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల‌ సంఖ్య 14731. ఇప్ప‌టివ‌ర‌కూ 23,05,438 మంది ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నారు.Next Story
Share it