Nalgonda: వాహన తనిఖీలు.. 13 కిలోల బంగారం స్వాధీనం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కారులో కారులో తరలిస్తున్న భారీ బంగారాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By అంజి  Published on  19 March 2024 8:27 AM IST
Cops, gold, Nalgonda district, Telangana

Nalgonda: వాహన తనిఖీలు.. 13 కిలోల బంగారం స్వాధీనం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కారులో కారులో తరలిస్తున్న భారీ బంగారాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మిర్యాలగూడలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసు బృందం ఈదులగూడ చౌరస్తాలో బొలెరో కారును ఆపింది. తనిఖీల్లో రూ.5.73 కోట్ల విలువైన 13 కిలోల బంగారం దొరికింది. టీఎస్‌ 09 యూఈ 2479 నెంబర్‌ గల వాహనం హైదరాబాద్ నుంచి కోదాడ వైపు వెళుతోంది. డీఎస్పీ రాజశేఖరరాజు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు.

బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ వాహనం డిస్ట్రిబ్యూటర్లకు బంగారం సరఫరా చేసే ఏజెన్సీకి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నల్గొండ పోలీస్ సూపరింటెండెంట్ చందన దీప్తి మాట్లాడుతూ.. ''మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా, ఓటర్లను ప్రలోభపెట్టడానికి నగదు,ఇతర విలువైన వస్తువులను అక్రమంగా రవాణా చేయకుండా నిరోధించడానికి కట్టుదిట్టమైన నిఘా ఉంచాం. జిల్లా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు'' అని తెలిపారు.

Next Story