హైదరాబాద్: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. 'వస్త్రధారణ కంఫర్ట్‌గా, నీట్‌గా ఉండాలి. మన సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిండుగా ఉండాలి. మేం ఎలాగైనా బట్టలు వేసుకుని తిరుగుతామనడం సరికాదు. ఇది నా అభిప్రాయం. ఎదుటి వ్యక్తులు కూడా బయటి అమ్మాయిని మన ఇంట్లో వారిలా చూడాలి' అని బీబీసీ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి. చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు. దరిద్రపు ము**. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది. ఇంకాస్త మంచివి వేసుకోవచ్చుగా అని అనాలనిపిస్తుంది. అలా అంటే స్త్రీలకు స్వేచ్ఛ లేదంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది' అని 'దండోరా' ఈవెంట్‌లో అన్నారు.