కేసీఆర్ అనుమతితోనే బ్యారేజీల నిర్మాణం..కాళేశ్వరం రిపోర్టులో కీలక అంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల పూర్తి నిర్మాణం కేసీఆర్ అనుమతితోనే జరిగాయి..అని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది.

By Knakam Karthik
Published on : 31 Aug 2025 10:51 AM IST

Telangana, Kaleshwaram report, Assembly Sessions, Congress Govt

కేసీఆర్ అనుమతితోనే బ్యారేజీల నిర్మాణం..కాళేశ్వరం రిపోర్టులో కీలక అంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల పూర్తి నిర్మాణం కేసీఆర్ అనుమతితోనే జరిగాయి..అని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టింది. కేసీఆర్ నిర్ణయం మేరకు, అనుమతితోనే మీడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సీడబ్ల్యూసీ అనుమతుల్లో లోపాలు ఉన్నట్లు తెలిపింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్వహణ సరిగ్గా లేదు..అని కమిషన్ తన రిపోర్టులో వెల్లడించింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం డీపీఆర్ సరిగ్గా చూడకుండానే అంచనాలు ఆమోదించారు. కాంట్రాక్ట్‌లకు లబ్ది చేయడానికే ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కాంట్రాక్ట్ ఎంపిక కూడా రూల్స్ కి వ్యతిరేకంగా జరిగాయి. బ్యారేజీల డిజైన్లు, అనుమతుల్లో కూడా లోపాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజా ధనం దుర్వినియోగం చేసారు. బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు. అధికారులు జోషి హరిరామ్, మురళీధర్ చర్యలు తీసుకోవాలి..అని పీసీ కమిషన్ నివేదిక పేర్కొంది.

Next Story