కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొ.కోదండరాంకు కీలక పదవి..!

తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ కొద్దిరోజుల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

By Srikanth Gundamalla  Published on  5 Dec 2023 10:51 AM IST
congress,  key position, kodandaram, telangana,

 కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొ.కోదండరాంకు కీలక పదవి..!

తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ కొద్దిరోజుల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌ను గద్దె దించి.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు పలువురు ఆ పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, సీపీఎం కూడా మద్దతు తెలిపింది. అయితే.. వీరిలో కోదండరాం కేసీఆర్‌ను ఓడించాల్సిందే అంటూ జిల్లాల్లో.. ప్రతి మీటింగ్‌లో పాల్గొంటూ ప్రచారం చేశార. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలకు దూరంగా కూడా ఉన్నారు. అంతేకాదు.. టీజేఎస్ కార్యకర్తలు అంతా కాంగ్రెస్‌ అభ్యర్తుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

దాంతో అందరి కృషి ఫలించడంతో కాంగ్రెస్‌ మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ గెలుపునకు పూర్తిగా సహకరించి.. ప్రచారంలో పాల్గొన్న కోదండరాంకి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించబోతుందని ప్రచారం జరుగుతోంది. కోదండరాంను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉన్నత విద్యావంతుడు కోదండరాం. కాబట్టి శాసనమండలికి పంపి .. విద్యాశాఖను కట్టబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ కోదండరాంను మంత్రిగా చేయడం కుదరకపోతే.. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా అయినా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగోతంది.

నిరుద్యోగులు బీఆర్ఎస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. తెలంగాణలో ప్రభుత్వం మారడానికి కారణమైంది నిరుద్యోగులే అంటున్నారు. గ్రూప్‌ -1, గ్రూప్‌-2 నిర్వహణలో విఫలం, పేపర్‌ లీకేజ్‌లు, ఎన్ని విమర్శలు వచ్చిన చైర్మన్‌ను మార్చకపోవడంతో బీఆర్ఎస్ సర్కార్‌పై ఆరోపణలు మరింత వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు నిరుద్యోగులు వ్యతిరేకంగా మారారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాటు అయిన తర్వాత ఎలా ముందుకెళ్తుంది..? కోదండరాంకు విద్యశాఖ లేదంటే టీఎస్‌పీఎస్‌ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియనుంది.

Next Story