ఆయనే కాంగ్రెస్ సీఎం.. నా మద్దతు ఉంటుంది: వీహెచ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని అందుకుంది.

By Srikanth Gundamalla  Published on  4 Dec 2023 6:21 AM GMT
congress, telangana, vh comments,

ఆయనే కాంగ్రెస్ సీఎం.. నా మద్దతు ఉంటుంది: వీహెచ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని అందుకుంది. 64 స్థానాల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్‌ 39 స్థానాలకే పరిమితం అయ్యింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను నిజం చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో పాటు.. బీఆర్ఎస్‌ అభ్యర్థులపై ఉన్న కొంత మేర వ్యతిరేకతతో ఈసారి కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది. అయితే.. గెలవనయితే గెలించింది కానీ.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ సీఎంగా ఎవరు ఉంటారనేదానిపై ఆసక్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్‌రెడ్డి సరైన వ్యక్తి అని కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్‌ ఎంతగానో కష్టపడ్డారని పేర్కొన్నారు. 80 నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డికే తన మద్దతు ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు.

తెలంగాణలో విజయం తర్వాత కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తు జరుగుతోంది. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం కూడా ఏర్పాట్లపై ఆరా తీస్తోంది. సీఎల్పీ నేత ఎంపిక నిమిత్తం ఏఐఈసీస పరిశీలకులు గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయలు సేకరిస్తారు. ఎంపిక ప్రక్రియ పూర్తవగానే ఆ నివేదికను ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపనున్నారు. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ అధిష్టానం ఇవ్వగానే తదుపరి కార్యక్రమం నిర్వహిస్తారు.

Next Story