Telangana: రేపే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 12:32 PM GMT
congress, telangana,   cm candidate,

Telangana: రేపే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన మేజిక్‌ ఫిగర్‌ను కాంగ్రెస్‌ దాటేసింది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది. గతంలో రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు అనీ.. ఆరోజే సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పారు. కానీ.. తాజాగా కాంగ్రెస్‌ గెలుపు తర్వాత సోమవారమే సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

పూర్తి ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆదివారం రాత్రే సీఎల్పీ సమావేశం ఉంటుందని సమాచారం. ఈ భేటీలో ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అయితే.. సీఎం ఎవరనే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. రేవంత్‌రెడ్డిని సీఎం చేస్తారా.? లేదంటే ఇప్పటి వరకు సీఎల్పీ నేతగా ఉన్న భట్టిని సీఎం చేస్తారా అనే దానిపై చర్చ కొనసాగుతోంది. అంతేకాదు.. ఉత్తమ్‌, సహా పలువురు నేతలు తాము సీఎం అభ్యర్థులం అంటూ ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎం ఎవరనేది తెలంగాణలో ఆసక్తికరంగా మారింది.

ప్రమాణస్వీకారం ఒక్కరోజు వ్యవధిలో చేసే వ్యవహారం కాదని చెబుతున్నారు. భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని.. దానికి సమయం అవసరం పడుతుందని చెప్పారు. అంతేకాక.. ప్రముఖ నేతలు కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి కాస్త సమయం పట్టే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

Next Story