బహిరంగ లేఖలో.. రేవంత్ రెడ్డి నిజాలు..!

Congress MP Revanth Reddy Padayatra. తాజాగా సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  12 Feb 2021 4:05 PM IST
Congress MP Revanth Reddy Padayatra.

తెలంగాణలో మళ్లీ రాజకీయాలు ముదిరిపోతున్నాయి. గతంలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ల మద్య వార్ కొనసాగేది. కానీ ఇప్పుడు తెరపైకి బీజేపీ వచ్చింది. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఆదిపత్యం కొనసాగించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతు భరోసా దీక్షలో అనేక మంది రైతులు తమ సమస్యలు నా దృష్టికి తెస్తున్నారని, రెండేళ్లైనా లక్ష రుణమాఫీ హామీ అమలు కాలేదని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

రైతు బందు, రైతు రాజ్యం తెస్తానంటున్న టీఆర్ఎస్ సర్కార్ వాళ్లకు చేసింది ఏమిటి అంటూ ప్రశ్నించారు. రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని.. నమ్మి ఓట్లు వేస్తే తాము అన్యాయం అవుతున్నామని.. కష్టాలపాలు అవుతున్నామని అన్నారు. ఇక యాసంగి నాట్లు మొదలైన తరుణంలో యూరియా కొరత ఉందని రైతులు చెబుతున్నారని రేవంత్ పేర్కొన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు పెట్టుబడి రాని పరిస్థితి ఉందన్న ఆయన దీనికి మీరే బాధ్యులని అన్నారు.

బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్న ఆయన రైతు బంధు నిధులు పాత రుణాల వడ్డీ కింద జమేసుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే తక్షణం రుణమాఫీ నిధులు విడుదల చేయండని రేవంత్ రెడ్డి కోరారు. తక్షణం రుణమాఫీ నిధులు విడుదల చేయాలని కోరారు. యూరియా కొరత ఉందని రైతులు వాపోతున్నారని చెప్పారు. సన్నరకం వరి పండించిన రైతులకు పెట్టుబడి రాని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతులందరికీ రైతుబంధు నిధులు అందటం లేదని వివరించారు.




Next Story