బీజేపీ నేత‌లు పీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి శ్రీతేజ్‌ కుటుంబానికి కోటి రూపాయలు ఎందుకు ఇప్పించలేదు.?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ జాతీయ నేతల నుండి రాష్ట్ర నేతల వరకు ప్రోలాంగ్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  23 Dec 2024 1:33 PM GMT
బీజేపీ నేత‌లు పీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి శ్రీతేజ్‌ కుటుంబానికి కోటి రూపాయలు ఎందుకు ఇప్పించలేదు.?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ జాతీయ నేతల నుండి రాష్ట్ర నేతల వరకు ప్రోలాంగ్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో స్వామీజీ ప్రోగ్రాం తొక్కిసలాటలో 100 మందికిపైగా చనిపోయారని.. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నా.. ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు.

ఇండస్ట్రీలో సమస్యలు తెలుస్తాయని దిల్ రాజుకు ఫిల్మ్ డేవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ హాయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి అయిందని.. ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పై, ఫిల్మ్ ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడార‌న్నారు. మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారు.. రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవకుంటే అల్లు అర్జున్ రియల్ హీరో అయ్యేవాడన్నారు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని.. బీజేపీ ఎంపీ పురందేశ్వరి దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని అంటున్నారు.. బండి సంజయ్, పురంధేశ్వరి, అశ్విని వైష్ణవ్, లక్ష్మణ్ పీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి కోటి రూపాయలు బాధిత కుటుంబానికి ఎందుకు ఇప్పించలేదు.? అని ప్ర‌శ్నించారు. అల్లు అర్జున్ తప్పులేదని అంటున్నారు.. మహిళ చావుకు ఎవరు కారణం అని ప్ర‌శ్నించారు. దిల్ రాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇండస్ట్రీలోనే ఉంటార‌న్నారు. వివాదాలను కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

Next Story