ఎమ్మెల్సీ బరిలోకి కాంగ్రెస్ ఎవరిని దింపిందంటే.?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది.

By Medi Samrat  Published on  16 Jan 2024 12:48 PM GMT
ఎమ్మెల్సీ బరిలోకి కాంగ్రెస్ ఎవరిని దింపిందంటే.?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేశారనేది వార్తల సారాంశం. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నుండి వీరికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా కధనాలు పేర్కొంటున్నాయి. అద్దంకి దయాకర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ టిక్కెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్ 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు జనవరి 18, గురువారంతో ముగియనుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 4న నోటిఫికేషన్ జారీ అయింది. రెండు ఉపఎన్నికలు కావటంతో ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లను ఇచ్చింది. జనవరి 11 నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. జనవరి 29న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది.

Next Story