హైదరాబాద్: అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ తనలోని సింగర్‌ని బయటపెట్టారు. రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల పనితీరునుపై అసెంబ్లీలో పాట పాడి ప్రశంసించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయంటూ అసెంబ్లీలో పాట పాడారు. 'ఆలయం దేవాలయం.. ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం' అంటూ గురుకులాల గురించి పాట రూపంలో సభ్యుల ముందు ఆవిష్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.