కేటీఆర్‌కు మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం నోటీసులు

కేటీఆర్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఏఐసీసీ ఏపీ పరిశీలకుడు మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం దావా నోటీసులు పంపించారు.

By Srikanth Gundamalla  Published on  31 Jan 2024 4:17 PM IST
congress, Manickam Tagore, defamation notice,  KTR,

 కేటీఆర్‌కు మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం నోటీసులు 

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఏఐసీసీ ఏపీ పరిశీలకుడు మాణిక్కం ఠాగూర్‌ పరువునష్టం దావా నోటీసులు పంపించారు. తాను రూ.50 కోట్లు తీసుకుని రేవంత్‌రెడ్డికి పీసీసీ పదవి ఇప్పించానని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. ఈ తప్పుడు ఆరోపణలపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే కోర్టును ఆశ్రయించి చట్టపరంగా ముందుకు వెళ్తానని మాణిక్కం ఠాగూర్ నోటీసుల్లో చెప్పారు. అయితే.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సంహిచేది లేదని.. వివరణ ఇవ్వాలని మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు మాణిక్కం ఠాగూర్ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. మాణిక్కం ఠాగూర్‌ గందరగోళంలో ఉన్నారని పేర్కొన్నారు. వారి పార్టీ నేత, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి చెప్పిన మాటలనే తాను గుర్తు చేశానని అన్నారు. తనకు పంపిన నోటీసులను సెక్రటేరియట్‌లో కూర్చొని ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పంపాలని అన్నారు. ముందుగా ఆ మాటలను అన్నది కోమటిరెడ్డి కాబట్టి.. ఆయనకే పంపాలని అదే సరైన అడ్రస్‌ అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

కేటీఆర్‌ ఎక్స్ పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. 'మీరు ఎందుకు గందరగోళంలో ఉన్నారు. ఈ నోటీసులను తప్పు అడ్రస్‌కు పంపించారు. రేవంత్‌రెడ్డి మీకు రూ.50 కోట్ల లంచం ఇచ్చి పీసీసీ చీఫ్‌ పదవి కొన్నారనీ.. మీ కాంగ్రెస్‌ సభ్యుడు, అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. అది రికార్డుల్లో కూడా ఉంది. ఆ కామెంట్లనే నేను ఇప్పుడు మళ్లీ చెప్పారు. ఆయన చెప్పింది గుర్తు చేశారు. వెంకట్‌రెడ్డి తన ఆరోపణలను కూడా ఉపసంహరించుకోలేదు. ఇంకా వివరణ ఇవ్వలేదు. పరువు నష్టం నోటీసును తెలంగాణ సచివాలయంలో ఉన్న వెంకట్‌రెడ్డి గారికి వినిపంచాలి. అదే సరైన అడ్రస్' అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టులో రాసుకొచ్చారు.

Next Story