నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి రవి దారుణ హత్యకు గురయ్యారు.

By -  Knakam Karthik
Published on : 12 March 2026 12:37 PM IST

Telangana, Nizamabad, Congress Leader, Immadi Ravi, Murder Case

నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి రవి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని ఇందల్వాయి గ్రామ శివార్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. రవి తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన బంధువే ఈ దాడికి పాల్పడి హతమార్చినట్లు సమాచారం.

హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. గతంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించిన ఇమ్మడి రవి, ప్రస్తుతం ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఆయన భార్య హేమలత కేవలం కొన్ని వారాల క్రితమే గౌరారం గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ హత్యోదంతం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Next Story