కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని బోరున ఏడ్చేసిన రమేశ్‌రెడ్డి (వీడియో)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటితో ముగుస్తుంది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 6:27 AM GMTకాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని బోరున ఏడ్చేసిన రమేశ్‌రెడ్డి (వీడియో)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తుదిజాబితా అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ స్వల్ప మార్పులు కూడా చేసింది. ఇక ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారు మనస్తాపం చెందడం చూస్తూనే ఉన్నాం. కొందరు పార్టీని వీడటం చూశాం. కన్నీరు పెట్టుకున్నారు. కార్యకర్తల వద్దకు వెళ్లి బోరున ఏడ్చినవారూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సూర్యాపేట నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి కూడా నిరాశ ఎదురైంది. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. సూర్యాపేట నుంచి రమేశ్‌రెడ్డి పోటీ చేస్తారని.. అధిష్టానం కూడా టికెట్ కేటాయిస్తుందని అందరూ అనుకున్నారు. దాంతో.. దీమా కొంతకాలం పాటు ప్రచారం కూడా చేసుకున్నారు. ఇద్దరి మధ్య పోటీ నెలకొని ఉండగా.. చివరకు కాంగ్రెస్ అధిష్టానం మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికే టికెట్ కేటాయించింది.
అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో పటేళ్ రమేశ్‌రెడ్డి మనస్తాపం చెందారు. ఆయన ఎంతో కన్నీటి పర్యంతమయ్యారు. రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బోరున విలపించారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని ఏడ్చారు. రమేశ్‌రెడ్డి బోరున ఏడుస్తున్న వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. పలువురు కార్యకర్తలు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోవైపు రమేశ్‌రెడ్డి మాత్రం ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో రిట్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు సమాచారం.
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేశ్‌రెడ్డి దామోదర్‌రెడ్డికి సూర్యాపేట టికెట్ కేటాయించిన కాంగ్రెస్టికెట్ దక్కకపోవడంతో బోరున ఏడ్చిన రమేశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు pic.twitter.com/oaDVEEJVuP
— Newsmeter Telugu (@NewsmeterTelugu) November 10, 2023