కేసీఆర్ ప్రభుత్వం సినిమాల్లో విలన్ల మాదిరి వ్యవహరిస్తోంది : భట్టి విక్రమార్క

Congress Leader Bhatti Vikramarka Slams KCR Govt. సినిమాల్లో విలన్లు మాదిరి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

By Medi Samrat
Published on : 16 Feb 2021 4:00 PM IST

Congress Leader Bhatti Vikramarka Slams KCR Govt.

గంగాపూర్ : సినిమాల్లో విలన్లు మాదిరి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన ప్రజలకు కేటాయించిన‌ భూములను కేసీఆర్ ప్ర‌భుత్వం గుంజుకుంటుంద‌ని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ముఖముఖిలో భాగంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగ‌ళ‌వారం జడ్చర్ల నియోజకవర్గం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్దండాపూర్ గ్రామ ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక.. 2013 భూ సేకరణల చట్టం ప్రకారమే బాధితులకు నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్దండాపూర్ రిజర్యాయర్ లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టించాలని, భూములు కోల్పోయిన వారికి భూములు, అదే దళిత గిరిజనులకు రెండింతల భూములు ఇవ్వాలని భట్టి చెప్పారు. అదే విధంగా డబ్బులు ఇవ్వాల్సివస్తే మార్కెట్ రేటుకు మూడింతలు ఇవ్వాలని డిమాండ్ భట్టి చెప్పారు.

గ్రామప్రజలకు వివరాలు చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని భట్టి ప్రశ్నించారు. ఇదేమని అడిగిన రైతులను పోలీసుల చేత బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం అనేది దురదృష్టకరమని అన్నారు. ఉద్దండాపూర్ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని భట్టి అన్నారు. ఉద్దండాపూర్ ప్రజలకు న్యాయం చేయకుండా ఇండ్లు ఖాళీ చేయించడం కుదరదని అన్నారు.


Next Story