హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తామన్నారు. రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్‌షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వీలైనంత త్వరగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అన్ని గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో, పాఠశాల మధ్యాహ్న భోజనాల్లో నాణ్యత పాటించాలని అన్నారు.