తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. పలు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, వ్యూహ కమిటీలతో సహా పలు కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.
By అంజి Published on 9 Sep 2023 3:15 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. పలు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, వ్యూహ కమిటీలతో సహా పలు కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. ప్యానెల్ సభ్యుల్లో వంశీ చంద్ రెడ్డి, ఇ. కొమ్రయ్య, జగన్‌లాల్ నాయక్, ఫక్రుద్దీన్ ఉన్నారు.
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉపాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్‌లు నియమితులయ్యారు. దామోదర రాజనర్సింహ, పూనాల లక్ష్మై, బలరాం నాయక్, ఆర్ దామోధర్ రెడ్డి, జి. చిన్నా రెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, ఒబైదుల్లా కొత్వాల్, తాహెర్ బిన్ హమ్దాన్, యర్రా శేఖర్, జి నాగయ్యా, జి. సుజాత, రవళి రెడ్డి, కె. వెంకట స్వామి, మర్రి ఆదిత్య రెడ్డిని ఎంపిక చేశారు.
వ్యూహాత్మక కమిటీకి ప్రేంసాగర్‌రావు నేతృత్వం వహిస్తారు. దానికి తోడు ఏఐసీసీ కార్యక్రమ అమలు కమిటీ, ప్రచార కమిటీ, ఛార్జ్ షీట్ కమిటీ, కమ్యూనికేషన్ల కమిటీ, శిక్షణ కమిటీలను కూడా పార్టీ ఏర్పాటు చేసింది. తక్షణమే అమలులోకి వచ్చేలా ఈ కమిటీల ఏర్పాటు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ప్రకటన తెలిపింది. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని గద్దె దించుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది.
తొమ్మిది మందితో ఎన్నికల నిర్వహణ కమిటీ, 24 మందితో మ్యానిఫెస్టో కమిటీ, పది మందితో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, 12 మందితో పబ్లిసిటీ కమిటీ, 14 మందితో పబ్లిసిటీ కమిటీ, 9 మందితో కమ్యూనికేషన్ కమిటీ, 17 మందితో శిక్షణ కమిటీ, 13 మందితో స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.