తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఖరారు చేశారు. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. అసెంబ్లీలో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన జారీ చేసింది.