తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మెదక్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో చెట్టుకు ఉరివేసుకుని సాయికుమార్ సూసైడ్ చేసుకున్నాడు. సాయి కుమార్ ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సాయి కుమార్ ఆత్మహత్య పాల్పడ్డాడు.
మరోవైపు సిద్ధిపేటలో ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబం సూసైడ్‌కు యత్నించింది. భార్య, పిల్లలకు విషమిచ్చిన తర్వాత కానిస్టేబుల్ బాలకృష్ణ ఉరివేసుకున్నాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి చెందాడు. భార్య, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఒకే రోజు ఆత్మహత్య చేసుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ చనిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిదిం. కానిస్టేబుళ్ల ఆత్మహత్యలపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.