డైట్, కాస్మొటిక్ చార్జీల విష‌యంలో సీఎం కీల‌క ఆదేశాలు.. 7 ల‌క్ష‌ల విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం..

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

By Medi Samrat  Published on  1 Nov 2024 5:23 PM IST
డైట్, కాస్మొటిక్ చార్జీల విష‌యంలో సీఎం కీల‌క ఆదేశాలు.. 7 ల‌క్ష‌ల విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం..

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు 40 శాతం మేరకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలన్న అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి యథాతథంగా ఆమోదించారు.

ఈ పెంపుదల వల్ల రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ మల్లు రవి కూడా ఉన్నారు.

దీపావళి పండుగ శుభ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.

Next Story