4 పథకాలను ప్రారంభించిన సీఎం.. ఇవాళ అర్ధరాత్రి అకౌంట్లలోకి డబ్బులు

భూమికి విత్తనానికి ఉండే బలమైన అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌ పార్టీకి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

By అంజి  Published on  26 Jan 2025 5:45 PM IST
CM Revanth, new schemes, Telangana

4 పథకాలను ప్రారంభించిన సీఎం.. ఇవాళ అర్ధరాత్రి అకౌంట్లలోకి డబ్బులు

భూమికి విత్తనానికి ఉండే బలమైన అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌ పార్టీకి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో నూతన పథకాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ముందు నుంచి రైతు పక్షపాతిగా ఉందని చెప్పారు. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారానికి 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. అంతకుముందు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌ కార్డు పథకాలను సీఎం రేవంత్‌ ఆవిష్కరించారు.

నారాయపేట జిల్లా చంద్రవంచ గ్రామంలో లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. రాష్ట్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు సీఎం తెలిపారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి అర్ధరాత్రి నుంచి జమ అవుతాయని సీఎం తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో నేడు అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు నగదు జమ అవుతుందని అన్నారు.

Next Story