అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు: సీఎం రేవంత్‌రెడ్డి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 5:58 AM GMTఅన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు: సీఎం రేవంత్‌రెడ్డి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందనీ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రబుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత సహకారం మహిళల అభివృద్ధి కోసం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలకు అండగా నిలవాలనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను తెస్తోందని చెప్పారు. మమిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి దిక్సూచిగా నిలుస్తుందనే నమ్మకం తనకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.