ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో ఉదయం 8:45 గంటలకు శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. సీఎం రేపటి పర్యటనపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మొదట సీఎం స్వామి వారి దర్శనం చేసుకుంటారు.. ప్రత్యేక పూజల అనంతరం 10:00 గంటలకు YTDA అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 1:00 PM కి వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వార భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శిస్తారు. అనంతరం మూసీ పరివాహ ప్రాంత రైతులతో సమావేశం అవుతారు. మూసీ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.