హైదరాబాద్: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిలా ఉండేలా డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వెబ్‌సైట్‌ను పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది. అబిడ్స్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు వెబ్‌సైట్‌ని ప్రారంభించనున్నారు. కంపెనీల్లోని ఉద్యోగ అవకాశాలు, అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌ల వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి.
నిరుద్యోగులు, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే, కంపెనీలే నేరుగా ఎంపిక చేస్తాయి. ఇందులో నమోదైన అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. అభ్యర్ధులకు కంపెనీలే నేరుగా మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ పంపడంతోపాటు కాల్‌చేసి పిలుస్తాయి. ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని కంపెనీలే డైరెక్ట్‌గా అభ్యర్థులతో మాట్లాడతాయని అధికారులు స్పష్టం చేశారు.