తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు పంపారు. ఫేక్ వీడియోపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెష్ సెల్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్‌తో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అమిత్ షా మాట్లాడినట్టు ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ సమన్లు ఇచ్చారు.
ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ (IFSO) దర్యాప్తు చేపట్టింది. కాగా, ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని మోదీ సైతం ఫైర్ అయ్యారు. కాగా ఇదే ఫేక్ వీడియోకు సంబంధించి.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. U/Sec 469, 505(1) C IPC* ప్రకారం కేసు బుక్ చేయబడింది. కల్పిత, మార్ఫింగ్ వీడియోపై తెలంగాణ బీజేపీ యూనిట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.