Medaram: సీఎం రేవంత్‌ తులాభారం.. 68 కిలోల బెల్లం సమర్పణ

మేడారంలో సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పునరుద్ధరించిన వనదేవతల ఆలయాన్ని సీఎం ప్రారంభించారు.

By -  అంజి
Published on : 19 Jan 2026 8:22 AM IST

Medaram: సీఎం రేవంత్‌ తులాభారం.. 68 కిలోల బెల్లం సమర్పణ

Medaram: సీఎం రేవంత్‌ తులాభారం.. 68 కిలోల బెల్లం సమర్పణ

మేడారంలో సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. పునరుద్ధరించిన వనదేవతల ఆలయాన్ని సీఎం ప్రారంభించారు. మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కును సమర్పించారు. వనదేవతలకు పట్టువస్త్రాలు, పూలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం పర్యటన అనంతరం భక్తులకు వనదేవతల దర్శనానికి అనుమతి లభించింది.

అంతకుముందు మంత్రులతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం, ఆధునికీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఆదివాసీలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంలో నిలువెత్తు (68 కిలోల) బంగారాన్ని (బెల్లం) సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ ఆర్థిక ఫోరం (#WEF26 ) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనకు బయలుదేరనుంది. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేష్‌ రంజన్‌, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్తున్నారు.

Next Story