హైదరాబాద్: హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నెడీ స్కూల్‌లో విద్యా వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తరగతుల మధ్య విరామం సమయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. హార్వర్డ్-ఎక్స్ వైస్-ప్రోవోస్ట్, హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్స్లీ, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరెమీ వైన్‌స్టెయిన్‌లను కలిశారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ రైజింగ్ విజన్ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
కెనెడీ స్కూల్‌తో భాగస్వామ్య సహకారాన్ని సీఎం కోరారు. సీఎం ప్రతిపాదనకు హార్వర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. విద్యా రంగంలో నూతన ఫ్రేమ్‌వర్క్‌లపై హార్వర్డ్ ప్రొఫెసర్లతో చర్చించారు. పెద్ద స్థాయిలో విద్యా నాణ్యత పెంపు మార్గాలపై, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధిపై, మానవ వనరుల అభివృద్ధి–ఆర్థిక వృద్ధి సంబంధంపై చర్చించారు.