గవర్నర్‌ను కలిసిస సీఎం రేవంత్‌.. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి అవరతణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  1 Jun 2024 6:04 AM GMT
cm revanth reddy,  governor,  invitation, state formation day,

 గవర్నర్‌ను కలిసిస సీఎం రేవంత్‌.. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానం 

తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి అవరతణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఇప్పటి ఏర్పాట్ల పనులను అధికారులకు ఇచ్చింది. వారు కూడా తలాముకలై అవతరణ వేడుకల పనుల్లో బిజీ అయిపోయారు. దశాబ్ధి అవతరణ ఉత్సవాలు కావడంతో.. వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానాలను పంపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇక తాజాగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నన్ సీపీ రాధాకృష్ణన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించారు. ఆ తర్వాత కాసేపు గవర్నర్‌తో సమావేశం అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు తప్పకుండా రావాలని ఆహ్వానాన్ని గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అందించారు. జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో దశాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని.. వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం ఇచ్చారు. మరోవైపు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ కూడా వస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కోసం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. జూన్‌ 2న ఉదయం పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర అవరతణ దశాబ్ధి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.

Next Story