హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాసులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగర వాసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 1:13 AM GMTహైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాసులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగర వాసులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్‌గూడలో గౌడ కులస్తుల కోసం కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కల్లు గీత కార్మికులతో సరదాగా మాట్లాడారు. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత వారికి కిట్లను అందజేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్‌లో రీజనల్ రింగ్‌రోడ్డు తో పాటుగా భవిష్యత్‌లో రేడియల్ రోడ్స్ అభివృద్ధి కాబోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలా జరిగితే రంగారెడ్డి జిల్లాలోని భూములు బంగారం అవుతాయని చెప్పారు. మరోవైపు మెట్రో పొడిగింపులో భాగంగా త్వరలోనే హయత్‌నగర్ వరకు మెట్రో పరుగులు తీయబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అలాగే రంగారెడ్డి జిల్లా వాసులకు కూడా అదృష్టం పట్టబోతుందని సీఎం రేవంత్ అన్నారు. సైబరాబాద్ పేరుతో ఎలా అభివృద్ధి జరిగిందో.. అలాగే ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. న్యూయార్క్ సిటీతో పోటీ పడేలా మహేశ్వరంలో కూడా కొత్త సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. శంషాబాద్‌లో మెడికల్ టూరిజం హబ్, రాచకొండ ప్రాంతాల్లో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పటికే అద్భుతంగా ఉందనీ.. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న వారు వచ్చి సినిమా షూటింగ్స్ చేస్తూ ఉంటారన్నారు. ఇక అంతకంటే మంచిగా మరో ఫిల్మ్ సిటీని ప్రభుత్వం నిర్మిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.