ఆంధ్రప్రదేశ్‌తో కాదు.. ప్రపంచంతో మా పోటీ: సీఎం రేవంత్‌రెడ్డి
పక్క రాష్ట్రాలతో తమ పోటీ కాదనీ.. ప్రపంచంతోనే తమ పోటీ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 2:00 PM GMTఆంధ్రప్రదేశ్‌తో కాదు.. ప్రపంచంతో మా పోటీ: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లోని కోకాపేటలో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తాము పక్షం రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించామని ఈ సందర్బంగా చెప్పారు. తమ బృందం విదేశీ పర్యటన ద్వారా తెలంగాణకు రూ.31,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే.. తెలంగాణకు ఏపీ నుంచి పోటీ ఉంటుందని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీకి తరలిపోతాయని అంటున్నారని చెప్పారు. కానీ.. తమకు పోటీ ఆంధ్రప్రదేశ్ కానేకాదనీ చెప్పారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలతో తమ పోటీ కాదనీ.. ప్రపంచంతోనే తమ పోటీ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. తన వద్ద హైదరాబాద్ నగరం ఉందనీ.. దేశంలోనే అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇక్కడున్నాయని పేర్కొన్నారు. తాను పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచనను పక్కన పెట్టి.. ప్రపంచంతో పోటీ పడే విధానంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అయితే.. పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ వంటి నగరం లేదని ఉద్ఘాటించారు సీఎం రేవంత్. అన్నిటి కంటే ఇక్కడున్న సానుకూల పరిస్థితులు ఎక్కడా లేవని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడం వల్ల కంపెనీలు ఇక్కడి నుంచి తరలి వెళ్లే పరిస్థితి వస్తుందని ప్రజలు అంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ.. తన పోటీ ఎప్పుడూ పొరుగువారితో కాదనీ ప్రపంచ నగరాలతో అన్నారు. పొరుగువారికి హైదరాబాద్ లాంటి ప్రాంతం లేదని సీఎం రేవంత్ అన్నారు. pic.twitter.com/iCGUQKRVM1
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 14, 2024