మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శంచారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 11:20 AM GMTమేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు రాజకీయాలు మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో అవినీతి జరిగిందనీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శంచారు.
మంగళవారం అసెంబ్లీ సమావేశం ముగిసిన వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టును సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బ తిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా.. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రధానంగా బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 13, 2024
అసెంబ్లీ వాయిదా తర్వాత బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజ్‌కు సీఎం, మంత్రులు
మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు pic.twitter.com/ty5siMew29
మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు pic.twitter.com/cd7s8UdbYA
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 13, 2024