గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు.

By అంజి
Published on : 15 Aug 2024 10:25 AM IST

CM Revanth, Golconda Fort, Independence Day, Telangana

గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం జనగణమన ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ పాట ప్లే చేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం తర్వాత పలు సాంస్కృతి కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు సీఎం రేవంత్‌ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లోని సైనికుల స్మారక స్థూపం వద్దకు వెళ్లారు. అక్కడ పుష్పగుచ్ఛం పెట్టి నివాళి అర్పించారు. అటు తెలంగాణ సచివాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎస్‌ శాంతి కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story