'ఆ రూ.1800 కోట్లు వెంటనే ఇవ్వండి'.. నీతి ఆయోగ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

కేంద్రం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్‌ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి రేవంత్‌ విజ్ఞ‌ప్తి చేశారు.

By అంజి  Published on  6 Feb 2024 1:45 AM GMT
CM Revanth, NITI Aayog, Suman Bheri, Telangana

'ఆ రూ.1800 కోట్లు వెంటనే ఇవ్వండి'.. నీతి ఆయోగ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతి ఆయోగ్‌ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి రేవంత్‌ అనుముల విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు. అలాగే హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌, ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.

అంతకుముందు సీఎం రేవంత్‌.. సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హామీల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి తెలియ‌జేశారు. సమావేశంలో సీఎం రేవంత్​తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిశారు. లోకసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచే పోటీ చేయాలని కోరినట్లు భట్టి తెలిపారు.

Next Story