విజేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
CM KCR Wishes To Political Leaders. విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న పలు పార్టీల నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on
3 May 2021 3:42 AM GMT

వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న పలు పార్టీల నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా మూడోసారి తన పార్టీని పశ్చిమ బెంగాల్ లో గెలిపించి హాట్రిక్ సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడులో తన డిఎంకె కూటమిని విజయతీరాల వైపు నడిపించి, పదేండ్ల విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కేరళ రాష్ట్రంలో విజయాన్ని చేజిక్కించుకున్న ఎల్. డి.ఎఫ్ కూటమికి సీఎం అభినందనలు తెలిపారు. కేరళ సిపిఎం నేత పినరయి విజయన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అస్సాం రాష్ట్రంలో విజయం సాధించిన అస్సాం బిజెపి పార్టీ నేత సర్భానంద సోనోవాల్ కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story