రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికిన‌ సీఎం కేసీఆర్

CM KCR Welcomes President Droupadi Murmu At Begumpet Airport. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం

By Medi Samrat
Published on : 16 Jun 2023 7:23 PM IST

రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికిన‌ సీఎం కేసీఆర్

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్ర‌యంలో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి శాలువా కప్పి పూల బొకే అందించి స్వాగతం పలికారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్‌, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కూడా రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, షీహెచ్‌ మల్లారెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, నవీన్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి మంత్రులు, ప్రజాప్రతినిధులను, అధికారులను పరిచయం చేశారు.




Next Story