వ‌రంగ‌ల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

CM KCR visits Warangal lay foundation stone.వ‌రంగ‌ల్ జిల్లాలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌లు అభివృద్ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 9:52 AM GMT
వ‌రంగ‌ల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

వ‌రంగ‌ల్ జిల్లాలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేప‌డుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. తొలుత‌ సెంట్ర‌ల్ జైలు మైదానంలో నిర్మించ‌నున్న మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 60 ఎక‌రాల విస్తీర్ణంలో 24 అంత‌స్తుల్లో ఆస్ప‌త్రి నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. 2 వేల ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో 35 సూప‌ర్‌స్పెషాలిటీ విభాగాల‌తో ఆస్ప‌త్రిని నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేశారు.

ఆస్ప‌త్రికి భూమిపూజ చేసిన‌ అనంతరం కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీని సీఎం ప్రారంభించారు. ఐదుఎక‌రాల విస్తీర్ణంలో రూ.25కోట్ల‌తో ఈ భ‌వ‌న నిర్మాణాన్ని చేప‌ట్టారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. స‌మీకృత జిల్లా కార్యాల‌యాల స‌ముదాయ‌ము శిలాఫ‌ల‌కాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.










Next Story