న‌ల్ల‌గొండ జిల్లాలో నేడు కేసీఆర్ ప‌ర్య‌ట‌న

CM KCR tour in Nalgonda District today.సీఎం కేసీఆర్ నేడు న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2022 8:15 AM IST
న‌ల్ల‌గొండ జిల్లాలో నేడు కేసీఆర్ ప‌ర్య‌ట‌న

సీఎం కేసీఆర్ నేడు న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ ఇటీవల మరణించగా.. బుధ‌వారం సంతాప స‌భ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ పాల్గొన‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ హెలికాఫ్ట‌ర్‌లో హైద‌రాబాద్ నుంచి నార్కెట్‌ప‌ల్లి చేరుకుంటారు. సంతాప స‌భ‌లో పాల్గొని, ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. అనంత‌రం అక్క‌డే భోజ‌నం చేయ‌నున్నారు. తిరిగి హైద‌రాబాద్ బ‌య‌లుదేర‌నున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Next Story