సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి యాదాద్రికి బయలుదేరి వెలుతారు. ముగింపు దశంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నారు.
మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు(మార్చి 22 నుంచి మార్చి 28 వరకు) ఘనంగా ఉత్సవాలు జరుగనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, భారీగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై అధికారులతో చర్చించనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పునర్‌నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొండపైన, కొండ కింద అభివృద్ధి పనులన్నీ దాదాపు పూర్తి అయ్యాయి.