నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్‌

CM KCR to visit Mahalakshmi Temple in Kolhapur.తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు(గురువారం)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2022 9:45 AM IST
నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు(గురువారం) మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. కుటుంబ స‌మేతంగా కొల్హాపూర్ వెళ్తున్నారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు బేగంపేట విమానాశ్ర‌మం నుంచి ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ ఫ్యామిలీ బ‌య‌ల్దేర‌నున్నారు. దేశంలోని శ‌క్తి పీఠాల‌లో ఒక‌టైన మ‌హాల‌క్ష్మీ అమ్మవారిని సీఎం దంప‌తులు ద‌ర్శించుకోనున్నారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం తిరిగి సాయంత్రం హైద‌రాబాద్ కు ప‌య‌నం కానున్నారు.

అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదైన కొల్హాపూర్‌ మహాలక్ష్మీ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు. ప్రళయకాలం సంభవించినప్పుడు పరమశివుడు కాశీక్షేత్రాన్ని కాపాడినట్లుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి కూడా తన చేతులతో ఈ ప్రాంతాన్ని ఎత్తి కాపాడిందని స్థలపురాణం చెబుతుంది. పంచగంగ నదీ ఒడ్డున ఉన్న అమ్మవారిని.. జగద్గురువు ఆదిశంకరాచార్యులూ, ఛత్రపతి శివాజీతోపాటూ ఎందరో రాజులు దర్శించుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది.

Next Story