42 రోజుల త‌రువాత.. నేడు ద‌త్త‌త గ్రామానికి సీఎం కేసీఆర్‌

CM KCR to visit adopted village today.సీఎం కేసీఆర్ నేడు(బుధ‌వారం) త‌న ద‌త్త‌త గ్రామ‌మైన యాదాద్రి భువ‌న‌గిరి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 4:23 AM GMT
42 రోజుల త‌రువాత.. నేడు ద‌త్త‌త గ్రామానికి సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ నేడు(బుధ‌వారం) త‌న ద‌త్త‌త గ్రామ‌మైన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించ‌నున్నారు. తొలిసారి జూన్ 22న ఆగ్రామంలో ప‌ర్య‌టించిన సీఎం గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు. అనంతరం వారితో క‌లిసి సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల త‌రువాత మ‌రోసారి గ్రామానికి విచ్చేస్తున్నారు. సీఎం ప‌ర్య‌ట‌న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద‌యం 11 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.

ప‌ల్లెబాట కార్య‌క్ర‌మంలో తొలుత సీఎం దళితవాడలో పర్యటించి, తర్వాత గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలిస్తారు. ప్రజలతో మాట్లాడిన అనంతరం సర్పంచి పోగుల ఆంజనేయులు నివాసంలో భోజనం ముగించుకుని.. రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడతారు. గత పర్యటన సందర్భంగా తాను చేసిన పలు సూచనల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి మంగ‌ళవారం వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సంద‌ర్శించి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

Next Story