సిద్దిపేట లాల్‌ కమాన్‌పై.. రాత్రికి రాత్రే వెలసిన కేసీఆర్‌ విగ్రహం..!

CM kcr statue worn overnight in siddipet. సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లా కేంద్రానికే తలమానికమైన లాల్‌కమాన్‌పై ఆదివారం అర్థరాత్రి

By అంజి  Published on  23 Nov 2021 6:28 AM GMT
సిద్దిపేట లాల్‌ కమాన్‌పై.. రాత్రికి రాత్రే వెలసిన కేసీఆర్‌ విగ్రహం..!

సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లా కేంద్రానికే తలమానికమైన లాల్‌కమాన్‌పై ఆదివారం అర్థరాత్రి కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. లాల్‌ కమాన్‌పై సీఎం కేసీఆర్‌ విగ్రహం పెట్టడం వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగారు. విగ్రహాన్ని వెంటనే తొలగించాలంటూ ధర్నాకు దిగారు. దీంతో లాల్‌కమాన్‌ దగ్గర పోలీసులకు, అఖిలపక్ష నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలకు, బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రాత్రి 1.30 గంటలకు విగ్రహాన్ని కిందకు దించారు.

విగ్రహాన్ని పెట్టిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో అఖిలపక్ష నాయకులు శాంతించారు. సోమవారం ఉదయం ధర్నా చేపట్టిన అఖిల పక్ష నాయకులు.. పాలు, పసుపు, కుంకుమలతో లాల్‌కమాన్‌ను శుద్ధి చేశారు. చరిత్రాత్మకమైన లాల్‌ కమాన్‌పైన సీఎం కేసీఆర్ విగ్రహం పెట్టడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి అన్నారు. రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన వారి విగ్రహం లాల్‌కమాన్‌పై పెట్టడంతో ఆ ప్రాంతం అపవిత్రమైందని, అందుకే శుద్ధి చేశామని అన్నారు. లాల్‌కమాన్‌పై సీఎం కేసీఆర్‌ విగ్రహం పెట్టిన వారిని 24 గంటల్లో అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సిద్దిపేట్‌ బంద్‌కు పిలుపు ఇస్తామన్నారు.

Next Story
Share it